బీజేపీలో ద‌ళితుల‌కు స‌రైన స్థాన‌మే లేదు : రాహుల్‌ గాంధీ

-

గత ఓటములను దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. కాంగ్రెస్‌ పార్టీలో పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నవ్‌ సంకల్స్‌ శిబిర్‌ పేరిట 3 రోజుల సదస్సును ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సుల్లో అందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకుంది కాంగ్రెస్‌ అధిష్టానం. అయితే నేడు సదస్సు ముగింపు నేపథ్యంలో ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీలో ద‌ళితుల‌కు స‌రైన స్థాన‌మే లేద‌న్న రాహుల్‌… కాంగ్రెస్ పార్టీలో మాత్రం అన్ని వ‌ర్గాల‌కు స‌మ ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధం క‌లిగి ఉండ‌ట‌మ‌నేది కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే ఉంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌తో పార్టీకి సంబంధాలు తెగిపోయాయ‌న్న ఆయ‌న‌.. ఈ విష‌యాన్ని అంద‌రూ అంగీక‌రించాల్సిందేన‌న్నారు. ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు య‌త్నించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ య‌త్నం ఒక్క‌రోజో, రెండు రోజుల్లోనో ముగియ‌రాదన్న రాహుల్‌.. నెల‌ల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డాల్సిందేన‌ని చెప్పారు.దేశాన్ని ముందుకు న‌డిపించే స‌త్తా ఒక్క కాంగ్రెస్‌కే ఉంద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఉంద‌ని రాహుల్ గాంధీ తెలిపారు. తాను ఎన్న‌డూ అవినీతికి పాల్ప‌డ‌లేద‌ని ఆయ‌న తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version