రేపే అల్పపీడనం : 3 రోజుల పాటు భారీ వర్షాలు

-

నైరుతి రుతుపనాలు ఈ రోజుతో తెలంగాణ అంతటా వ్యాపించినవి. తెలంగాణాతో పాటు మహారాష్ట్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో కూడా పూర్తిగా ప్రవేశించినవి. ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియార్ స్థాయి వరకు ఉన్నది. దీని ప్రభావంతో ఈ నెల 11వ తేదీన ఉత్తర బంగళాఖాతం & పరిసర ప్రాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 24 గంటలలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా బలమైన క్రిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోనికి వస్తున్నవి. దీంతో తెలంగాణలో రాగల 2 రోజులు (10,11వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి (12వ తేదీ) అనేక ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణహెచ్చరికలు:-
తెలంగాణలో రాగల 3 రోజులు (10,11,12వ తేదీలు) ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమి వేగంతో)కూడిన వర్షం తెలంగాణాలోని కొన్ని ప్రదేశములలో మరియు భారీ వర్షములు కొన్ని ప్రదేశములలో (ఉత్తర, తూర్పు జిల్లాలలో) మరియు ఎల్లుండి (12వ తేదీన) అతి భారీ వర్షములు కూడా ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version