BREAKING : తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు

-

తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒరిస్సా తీరము & పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా – పశ్చిమ బెంగాల్ తీరములో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది.

ఈ రోజు మరియు రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు, రేపు భారీ వర్షాలు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలలో అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version