నిన్నటి నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరాలలో వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్ల పైన వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రోడ్ల పైన విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఆ ప్రాంతవాసులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇక నేడు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ఈరోజు విజయనగరం, మన్యం, శ్రీకాకుళం, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, సత్యసాయి, అనంతపురం, వైయస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో మోస్తారు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్షంతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచనలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనలు జారీ చేసింది. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతవాసులు అలర్ట్ గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.