తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పోలింగ్ కి ఇబ్బందులు తప్పవా..?

-

ప్రస్తుతం వేసవికాలం కావడంతో గత కొద్ది రోజులుగా ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి.  ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. రెండు, మూడ్రోజులుగా వేడి తీవ్రత తగ్గినా.. శనివారం మాత్రం మరోసారి తీవ్ర ప్రభావం చూపించింది. తాజాగా వాతావరణ శాఖ మరో అప్డేట్ ఇచ్చింది. పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. మే 11 నుంచి 15 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండడం విశేషం. సోమవారం మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం పోలింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, ఛండీఘడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, గోవా, ఛతీస్ గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version