రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్

-

తెలంగాణ రాష్ట్రంలో.. ఒమిక్రాన్‌ కేసులు విలయ తాండవం చేస్తున్నాయి. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇప్పటికే 40 కి పైగా కేసులు నమోదు కాగా.. తాజాగా మరో మూడు ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి. రాజన్న సిరిసిల్లా జిల్లాలో ముగ్గురికి ఒమిక్రాన్‌ సోకింది. దుబాయి నుంచి ఇటీవలే వచ్చిన వ్యక్తి లో ఒమిక్రాన్‌ గుర్తించగా.. బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందినట్లు పరీక్షలలో సోమవారం తేలింది. ముగ్గురు బాధితులను చికిత్స కోసం.. టిమ్స్‌ కు తరలించారు. ఈ మూడు కొత్త కేసులతో రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 4 కు చేరింది.

అటు వరంగల్ నగరం లో కూడా మరో ఒమి క్రాన్ కేసు నమోదు అయింది. వరంగల్ బ్యాంక్ కాలనీలో ఒకరికి కరోనా నూతన వేరియంట్ “ఒమిక్రాన్” వైరస్ సోకినట్లు గుర్తించారు వైద్యులు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తి ఒమి క్రాన్ నిర్ధారణ కావడం తో టైమ్స్ కి తరలించారు అధికారులు. ఇవాళ్టి ఒమిక్రాన్‌ కేసులతో తెలంగాణ రాష్ట్రంలో.. మొత్తం కేసుల సంఖ్య 50 కి చేరింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version