రాజశేఖర్-జీవిత కూతుర్లు స్టార్స్ గా ఎదకపోవడానికి కారణం అదేనా..?

-

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించినా..ఈ మధ్య సినిమాలు పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో రాజశేఖర్ కూతుర్లుకూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక శివాని , శివాత్మిక ఇద్దరూ కూడా సరైన గుర్తింపు దక్కించుకోలేదు. మొదటిసారిగా దొరసాని సినిమాగా శివాత్మిక టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు తాజాగా రంగమార్తాండ సినిమాలో శివాత్మిక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. మరి ఇప్పుడైనా ఈమే సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.Tollywood Ace Actor Rajashekar And His Family Gets Tested Positive For Covid-19

ఇక శివాత్మిక పై గత కొన్ని రోజులుగా పలు రూమర్లు రావడం జరిగింది కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలో ఇతర భాషలలో సైతం నటిస్తూ ఉన్నది. ఇక రంగమార్తాండ సినిమాకి డైరెక్టర్ గా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో అనసూయ కూడా ఒక దేవదాసు పాత్రలో కనిపిస్తోంది. ఇక శివాత్మిక ప్రొడ్యూసర్గా కూడా బాధ్యతలు చేపట్టడం ఇక శివాని రాజశేఖర్ విషయానికి వస్తే ఈమె 2 స్టేట్స్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంతకు ముందు తన తండ్రి నటించిన ఎవడైతే నాకేంటి, కల్కి, సత్యమేవ జయతే వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. అయితే శివాని, శివాత్మిక ఇద్దరు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యారు. అందుకు ముఖ్య కారణం కూడా మీరు కథల ఎంపిక విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా వీరిద్దరూ కథల విషయంలో కాస్త దృష్టి ఉంచుకొని ఎంచుకుంటే మంచిది అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక అంతే కాకుండా తను ఎంచుకునే కథలలో ఎవరైనా క్రేజీ హీరో తో ఎంచుకుంటే బాగుంటుందని ఆమె అభిమానులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా కెరియర్ లో సక్సెస్ సాధించాలి అంటే ఇప్పటినుంచి కెరియర్ పై దృష్టి పెట్టడం ఎంతవరకు అయినా మంచిది అని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version