టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఐపీఎల్ 16వ సీజ‌న్ 52వ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఢీ కొంటున్నాయి. జైపూర్‌లోని స్లో పిచ్ వేదిక‌గా ఇరుజ‌ట్లు పోటీ ప‌డ‌తున్నాయి. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు ఓడిన సంజూ సేన విజ‌యంపై క‌న్నేసింది. మ‌రోవైపు పాయింట్ల ప‌ట్టిక‌లో అడుగున ఉన్న హైద‌రాబాద్ గెలుపుపై గురి పెట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు జైపూర్ ఆతిథ్యమిస్తోంది. సొంతగడ్డ హైదరాబాదులోనే పరాజయాలు చవిచూసిన సన్ రైజర్స్ ఇవాళ జైపూర్ లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

ఐపీఎల్‌లో ఇప్ప‌టికి వ‌ర‌కు రాజ‌స్థాన్, హైద‌రాబాద్ 17 సార్లు త‌ల‌ప‌డ్డాయి. రాజ‌స్థాన్ 9, ఎస్ఆర్‌హెచ్ 8 మ్యాచుల్లో గెలిచింది. ఈ వేదిక‌పై ఆడిన మూడు మ్యాచుల్లో సంజూ జ‌ట్టు రెండు విజ‌యాల‌తో ఆధిక్యంలో ఉంది. మ‌రి, ఈసారి మ‌ర‌క్రం సేన అద‌ర‌గొడుతుందా? గ‌త సీజ‌న్ ర‌న్న‌ర‌ప్ స‌త్తా చాటుతుందా? అనేది మ‌రికొన్ని గంట‌ల్లో తేల‌నుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version