రాజ్‌కుంద్రా కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. పోర్న్ వ్యవహారంలో మరో నటితో పాటు నలుగురు నిర్మాతలు..

-

ముంబై: రాజ్ కుంద్రా కేసులో నటి గెహనాతో పాటు నలుగురు నిర్మాతలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం నటి షెర్లీన్ చెప్రాను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టారు. ఈ మేరకు పోర్నో వీడియోలకు నిర్మాతలుగా వ్యహరించిన వారిపై కేసులు నమోదు చేశారు. అంతేకాదు వారికి నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని ఆదేశించారు. వీరి నుంచి మరిన్ని విషయాలు రాబట్టొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

కాగా పోర్న్ వీడియోల కేసులో ప్రధాన సూత్రదారుడు, శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. రాజ్ కుంద్రాకు సంబంధించిన కంపెనీలో సోదాలు చేసి కీలక ఆధారాలు రాబట్టారు. ఆ కంపెనీకి సంబంధించిన సిబ్బందిని కూడా విచారించారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన 16 పేజీల మెయిల్స్ కూడా చెక్ చేశారు. లండన్ నుంచి పోర్న్ వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తించారు. కెర్నిన్ కంపెనీ హాట్ షాట్ యాప్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయింది. రాజ్ కుంద్రా కనుసనల్లోనే పోర్న్ వ్యవహారాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version