కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలకు ఎవరి వంతు సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది రాకుండా చర్యలు ప్రభుత్వాలతో కలిసి చేపడుతున్నారు. హీరోలు, హీరోయిన్ లు ఇలా ఎవరికి వారుగా తమ వంతు సాయం చేస్తూ లాక్ డౌన్ సమయంలో పేదలకు అండగా నిలబడుతున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఏకంగా 250 కుటుంబాలకు అండగా నిలబడింది. వారికి సరుకులు అందించాలని నిర్ణయం తీసుకుంది.
తన రాష్ట్రంలోని గుర్గావ్ లో తన తండ్రి తో కలిసి 250 కుటుంబాలను ఆమె దత్తత తీసుకుంది. గుర్గావ్‌లోని స్లమ్ ఏరియాలో ఉన్న 250 కుటుంబాలకు రెండు పూటల ఆహారం అందించడానికి ఆమె సిద్దమైంది. లాక్‌డౌన్ ఎఫ్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఈ సహాయం కొనసాగుతుంది అని ఆమె వివరించారు. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా చేసింది. దీనిపై పలువురు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
ఇక చాలా మంది హీరోయిన్ లు… పేదలకు అండగా నిలుస్తున్నారు. హీరోయిన్ ప్రణీత మాత్రం 50 కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలు అందిస్తోంది. లావణ్య త్రిపాఠి సినీ కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళ౦ కొన్ని మాస్కులు, శానిటైజర్లనుఇచ్చింది. స్టార్ హీరోయిన్ లు ఎవరూ కూడా ముందుకి వచ్చి సహాయం చేయకపోవడం గమనార్హం.