రంగస్థల నటుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించి..వెండితెరపైన తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్న వ్యక్తి దివంగత నటుడు రావు గోపాల్ రావు. ఆయన సిల్వర్ స్క్రీన్ పైన కనబడితే చాలు..జనాలు సంతోషపడిపోతుంటారు. విలక్షణమైన పాత్రలు పోషించిన ఆయన నట వారసత్వాన్ని ప్రస్తుతం ఆయన తనయుడు రావు రమేశ్ కొనసాగిస్తున్నారు.
తెలుగునాట ప్రతి కథానాయకుడి పాత్రలకు రావు గోపాల్ రావు పెట్టింది పేరు. కాగా, ఆయ తొలి సినిమా ‘శారద’ ద్వారానే చక్కటి పేరు సంపాదించుకున్నారు. ఇక ‘ముత్యాల ముగ్గు’ పిక్చర్ రావు గోపాల్ రావు నటనకు ప్రేక్షకలోకం ఫిదా అయింది.
అప్పట్లో అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ రావుగోపాల్ రావు తీసుకునే వారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. అయితే, ఆ తర్వాత కాలంలో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చి..వైద్యానికి డబ్బులు లేని పరిస్థితులు వచ్చాయట. అలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టైమ్ లోనే పరిస్థితి విషమించి రావు గోపాల్ రావు కన్ను మూశారు. 1994 ఆగస్టు 13న రావుగోపాల్ రావు మరణించారు. ఆయన మరణించిన క్రమంలో ఆయన చూడటానికి అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే వచ్చారట.
రావుగోపాల్ రావు మరణించే నాటి చిత్ర పరిశ్రమ మద్రాసులోనే ఉంది. అయితే, అప్పటికే కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్ కు వచ్చి ఉన్నారని, దాంతో రావు గోపాల్ రావు అంత్యక్రియలకు అందరూ వచ్చే పరిస్థితులు లేవట. అలా చిత్ర పరిశ్రమలో వెలుగు వెలిగిన రావు గోపాల్ రావు అంత్యక్రియలకు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కాలేకపోయారట. ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించిన వారిలో అల్లు రామలింగయ్య, రేళంగి, జై.కృష్ణ, పి.ఎల్.నారాయణ వంటి అతి కొద్ది మంది ఉన్నారట. అంత్యక్రియలను రావు రమేశ్, ఆయన సోదరుడు క్రాంతి నిర్వహించారు.