ఛత్తీస్ గఢ్ లో దారుణం… ఎడ్యుకేషన్ ట్రిప్ పేరుతో విద్యార్థినిపై టీచర్ అత్యాచారం..

-

కామాంధుల ఆగడాలకు బాలికలు, యువతులు బలవుతున్నారు. నమ్మించి అత్యాచారానికి పాల్పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, దిశ, పోక్సో వంటి చట్టాలు తెచ్చినా.. మృగాళ్ల తీరులోొ మార్పు రావడం లేదు. దేశంలో రోొజుకు ఎక్కడోొచోట అత్యాచారాలు నమోదవుతూనే ఉన్నాయి. చివరకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే బాలికలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. చివకు కటకటాలపాలవుతున్నారు. తాజాాగా ఇలాంటి సంఘటనే ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నంద్ గావ్ జిల్లాలో పదకొండో తరగతి చదువులున్న బాలికపై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈనెల 2న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. డిసెంబర్ 2న నిందితుడు ఎడ్యుకేషన్ ట్రిప్ కుతీసుకెళ్తానిని బాధిత బాలికను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నాడు. ఓ నిర్మాణష్య ప్రదేశంలో కారు ఆపి సదురు విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే .. బాధిత బాలిక అక్కపై కూడా అత్యాచారం చేస్తానని బయపెట్టాడు. ఈ ఘటన గురించి ఇటీవల బాలిక తల్లిదండ్రులకు సోమవారం తెలియజేసింది. వెంటనే పోలీసులకు తెలియజేయగా.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version