నిజామా? క్రాక్ ‘ఓటిటి’లో విడుదల కానుందా!?

-

కరోనా వైరస్.. అన్నింటిని మార్చేసింది. ఇంకా ఈ కరోనా కారణంగా ప్రస్తుతం సినీ ఇండ‌స్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. ఈ థియేటర్ లో విడుదల కావాల్సిన సినిమాలు అన్ని ఆగిపోయాయి. చిన్న సినిమాలు ఓటిటిలో విడుదల అయితే పెద్ద సినిమాలు మాత్రం థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూస్తున్నాయి.

shruti hasan, gopichand malineni, ravi teja, krack movie, release on ott

ఇంకో రెండు నెల‌లు వరకు థియేట‌ర్స్ తెరిచే అవకాశం క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే ఇప్పుడు క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజుకు దారుణంగా పెరుగుతున్నాయి. ఇంకా చేసేదేమీ లేక స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంల‌లో రిలీజ్ చెయ్యాలని కొందరు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ర‌వితేజ‌, శ్రుతిహాస‌న్ నటించిన ”క్రాక్” సినిమా కూడా ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

గోపీ చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను స‌ర‌స్వ‌తి ఫిల్మ్స్ డివిజ‌న్ ప‌తాకం పై బి. మ‌ధు నిర్మించారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్ట‌ర్స్, టీజ‌ర్‌కి మంచి స్పందన వచ్చింది. ఇంకా అలాంటి ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసేందుకు దర్శ‌క, నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు వార్తలు వస్తున్నాయ్. కానీ ఈ వార్తకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version