పెద్ద స్టార్స్ కే సాధ్యం కాని రికార్డ్ సాధించిన రవి తేజ..!!

-

రవితేజ హీరోగా, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన చిత్రం ధమాకా,నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్  మూవీ  విడుదల అయిన తర్వాత మంచి వసూళ్లు సాధిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రూపొందిన ఈ సినిమా  కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రవితేజ  ధమాకా సినిమా రూపంలో రికార్డ్ విజయం అందేలా చేసింది.

 రీసెంట్ గా తన ధమాకా సినిమా వీక్ డేస్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది.. ఈ సినిమా మాస్ రాజా కెరీర్ లో భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.ఇక రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు ఏవి లేవు కనుక ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు కు పరుగులు తీస్తుందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ చిత్రం నైజాం లో అరుదైన రికార్డు నెలకొల్పింది.

నైజాం ఏరియా లో లో 10 వ రోజు 2 కోట్ల రూపాయల కి పైగా షేర్ ను సొంతం చేసుకుంది. మొత్తం గా 10 రోజులకు నైజాం లో ఈ చిత్రం 12.5 కోట్ల రూపాయల కి పైగా భారీ వసూళ్లను రాబట్టడం. జరిగింది. ఆశ్చర్యకరంగా పదవ రోజు నాన్ ఎస్ ఎస్ రాజమౌళి రికార్డ్ ను సొంతం చేసుకుంది. పదవ రోజు నాలుగు కోట్ల రూపాయల కి పైగా షేర్ ను సాధించింది. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి సిరీస్ చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ ధమాకా 10 వ రోజు వసూళ్లు ఎక్కువగా ఉండి రవి తేజ ను గాల్లో తేలియాడేలా చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version