బ్యాంకులకు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక సూచనలు

-

 

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ ప్రతికూల పరిస్ధితుల నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌.. బ్యాంకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హితవు పలికారు. సవాళ్లను స్వీకరించకుండా మితిమీరి తప్పించుకోవడం అంటే సొంతంగా ఓటమిని కొని తెచ్చుకోవడమే అని శక్తికాంత దాస్‌ హెచ్చరించారు.

బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. బ్యాంకులు తమ మౌలిక విధిని నిర్వహించకుంటే ఆదాయం రాదని వివరించారు. మోసాలు జరగకుండా తప్పించుకునేందుకు బ్యాంకులకు ఇంకా అవకాశం ఉందన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు అవి రూపొందించుకునే విధివిధానాలు.. సమస్యలను తగ్గిస్తాయని హితవు పలికారు. బ్యాంకింగ్‌ వ్యవస్ధ బలంగా, స్ధిరంగా ఉందన్నారు ఆర్​బీఐ గవర్నర్‌. మరింత వృద్ధి కోసం రాబోయే రోజుల్లో కొత్త విధానాలను రూపొందించుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news