ఏలూరు వింత వ్యాధి ఘటనలో విష తుల్యమైన ఆర్గానో క్లోరైన్ ఆనవాళ్లను నిపుణులు గుర్తించినట్టు సమాచారం అందుతోంది. మరిన్ని పరీక్షలు చేస్తే ఈ వ్యాధి కారణాలపై స్పష్టత వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణాలు మరింతగా నిగ్గు తేల్చేందుకు ఈరోజు ఎన్ఐఎన్, ఐఐసీటీ బృందాలు ఏలూరు చేరుకోనున్నాయి. 22 ప్రాంతాల్లో నీటి శాంపిళ్ల సేకరించారు అయితే వాటిని పరీక్షించినా నీటి శాంపిళ్లల్లో ఎటువంటి లోపాలు లేవని నిర్ధారణకు వచ్చారు. ఆ నీటి శాంపిళ్లకు 14 రకాల పరీక్షల చేశారు. ఈ-కోలి టెస్టుల ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు.
52 రక్తం నమూనాల సేకరించి పరీక్షలు చేసినా ఫలితాలు నార్మల్ గానే వచ్చాయి. 42 మందికి ప్రభుత్వం బ్రైన్ సీటీ స్కాన్ నిర్వహించినా ఫలితాలు నార్మల్ గానే వచ్చాయి. తొమ్మిది ప్రాంతాల్లో పాల నమూనాల సేకరించి విజయవాడ ల్యాబుకు పంపారు. వెన్నెముక నుంచి తీసుకున్న శాంపిళ్లల్లో నార్మలుగానే సెల్ కౌంట్, స్మియర్ టెస్టు ఫలితాలు ఉన్నాయి. ప్రభావిత ప్రాంతాల్లోని 43897 గృహాలకు గానూ 42012 గృహాల్లో మెడికల్ సర్వే పూర్తయింది. ఏలూరు ఘటనలో మొత్తం 275 మంది బాధితులని గుర్తించినట్టు ప్రభుత్వం పేర్కొంది. మెరుగైన చికిత్స కోసం ఏడుగురిని విజయవాడకు తరలించగా, 119 మంది బాధితులు డిశ్చార్జయ్యారు. మరో 30 మంది బాధితులు డిశ్చార్జుకు సిద్దంగా ఉన్నారు. ఈ కారణంతో హాస్పిటల్ లో చేరిన ఇద్దరు మరణించినట్టు తెలిసిందే.