‘రెడ్డి’ మంత్రులకు ఇబ్బంది లేదా?

-

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు మంత్రులుగా అవకాశం దక్కనివారికి, రెండున్నర ఏళ్లలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులు చేసి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. పనితీరు బాగోని మంత్రులని పక్కనబెట్టేసి కొత్తవారికి అవకాశం ఇస్తానని జగన్ అప్పుడే చెప్పారు. ఇటీవలే జగన్ పాలనకు రెండేళ్ళు పూర్తి అయిపోయాయి.

అంటే మరో ఆరు నెలల్లో కేబినెట్‌లో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ కేబినెట్‌లో ఎవరు ఉంటారు? కొత్తగా ఎవరు వస్తారు? అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో జగన్ కేబినెట్‌లో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డిని పక్కనబెడితే, కేబినెట్‌లో నలుగురు రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డిలు మంత్రివర్గంలో ఉన్నారు. అయితే వీరి నలుగురుని జగన్ అయిదేళ్లు కొనసాగించడం ఖాయమని తెలుస్తోంది. గత రెండేళ్లలో ఈ మంత్రులు బాగానే హైలైట్ అయ్యారు. అలాగే సీఎం జగన్‌కు సన్నిహితులు. ఆర్ధిక మంత్రిగా ఉన్న బుగ్గన స్థానాన్ని మరోకరితో రీప్లేస్ చేయడం కష్టం. ఆర్ధికపరమైన వ్యవహారాల్లో బుగ్గనకు మంచి నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆయన్ని మంత్రివర్గం నుంచి తప్పించడం కష్టం.

అటు పెద్దిరెడ్డి ప్రభుత్వంలోగానీ, పార్టీలో గానీ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఈయన ఐదేళ్లు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక యువ మంత్రి మేకపాటి సైతం సైలెంట్‌గా మంచి వర్క్ చేస్తున్నారు. అలాగే బాలినేని, సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. ప్రకాశం జిల్లా వైసీపీలో కీలకమైన నాయకుడు. కాబట్టి మేకపాటి, బాలినేనిలని సైతం మంత్రివర్గం నుంచి తప్పించడం కష్టమే.  మొత్తానికైతే ఈ నలుగురు రెడ్డి మంత్రులకు ఐదేళ్ల పదవి గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version