Regina Cassandra : కవ్వించే చూపులతో మాయ చేస్తున్న రెజీనా

-

రెజీనా కసాండ్రా..టాలీవుడ్ శివ మనసులో శ్రుతి అంటూ ఎస్ఎంఎస్ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీ అందంతో పాటు నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆ తర్వాత వచ్చి రొటీన్ లవ్ స్టోరీతో తెలుగు కుర్రాళ్లు ఈ చెన్నై చిన్నాదానితో ప్రేమలో పడిపోయారు.

రొటీన్ లవ్ స్టోరీ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత రెజీనాకు వరుస అవకాశాలు వచ్చాయి. ఓవైపు తెలుగులో బిజీగా ఉంటూనే మరోవైపు తమిళ, కన్నడ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది. అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. అనంతరం ఈ భామ బాలీవుడ్​కు వెళ్లింది. బీ టౌన్​లో ఏక్ లడ్ కీ కో దేఖాతో ఐసా లగా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇటీవల ఫర్జీ వెబ్ సిరీస్​తో మరోసారి అలరించింది. అంతకుముందు శూర్​వీర్ అనే వెబ్​సిరీస్​లో నటించింది.

రెజీనా కసాండ్రా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్​గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను ఖుష్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్​లో చాలా ట్రెడిషన్​ల్ లుక్​లో సందడి చేసింది. ఈ ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది. క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

పింక్ కలర్ డ్రెస్​లో రెజీనా చాలా అందంగా కనిపించింది. ఎత్నిక్ వేర్​లోనూ ఈ బ్యూటీ ముద్దుగా ఉంది. చెవులకు జుంకాలు పెట్టుకుని కవ్వించే పోజులతో కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. రెజీ.. యూ ఆర్ సో క్యూట్ అంటూ కుర్రాళ్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version