సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ బిజీబిజీగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని ఆయన కలిశారు. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అరగంట పాటు సాగిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ, ధాన్యం సేకరణ, సరఫరాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రిక్వెస్ట్ చేసినట్లు తెలిసింది.
సాయంత్రం సీఎం రేవంత్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తోనూ భేటీ కానున్నారు.పెండింగ్ ప్రాజెక్టులు, పలు అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్-2,రీజినల్ రింగ్ రోడ్డు, ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఆ తర్వాత రేవంత్ హస్తిన పెద్దలను కలిసే అవకాశం ఉంది.