దయచేసి మూడు పెళ్లిళ్ల గురించి చర్చ ఆపండి : రేణు దేశాయ్

-

పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణుదేశాయ్ అన్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. ఆ తర్వాత ఏవేవో కారణాల వలన విడాకులు తీసుకుని విడిపోయారు. పవన్ మాత్రం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవిస్తున్నాడు. కాగా తాజాగా రేణు దేశాయ్ పవన్ గురించి మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈమె మాట్లాడుతూ రాజకీయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ డబ్బు కోసం ఏ పనీ చేసే అంత మనిషి కాదు.. తనకు జీవిస్తున్న ఈ సమాజం ఎందుకు ఇలా ఉందని అలోచించి సామజిక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాడంటూ ప్రశంసించింది రేణు దేశాయ్. ఇకపై రాజకీయంగా ఏమైనా విమర్శలు చేయండి.

కానీ వ్యక్తిగత జీవితాలను ఇందులోకి లాగకండి అంటూ అభ్యర్ధించింది రేణు దేశాయ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జీవితంలో జరిగిన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడకండి అని రిక్వెస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news