ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఒకటికి మించి మొబైల్ ఛార్జర్లు ఉంటాయి. అంతేకాదు, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఛార్జింగ్ కేబుల్స్ వస్తున్నాయి. ఇలా రకరకాలుగా కేబుల్ చార్జర్ల వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే, ఇవి పాడవుతే.. రిపేయిర్ చేయకుండా.. కొత్తవి కొనుక్కుంటారు. అలాగే, ఇయర్ ఫోన్స్ కూడా కొంతకాలం తర్వాత పనిచేయవు. జనరల్‌గా ఇలాంటి ఎలక్ట్రానిక్ వేస్టును మనం పారేస్తూ ఉంటాం.
వీటిని ఇతరత్రా చిట్కాల కోసం వాడుకోవచ్చు. అవి డెకరేషన్ కోసం బాగా పనిచేస్తాయి. పాత కేబుల్‌ను ఉపయోగించి చిన్న బుట్టను తయారుచేసుకోవచ్చు. వైర్లు ఎక్కువకాలం బలంగా ఉంటాయి. ఆ బుట్టలో లోపల ఓ క్లాత్ రౌండ్‌గా సెట్ చేసి, అందులో చిన్న వస్తువుల్ని వేసుకోవచ్చు. పెన్నులు, పెన్సిల్స్, రబ్బర్లు వంటివి ఈ బుట్టలో వేసుకోవచ్చు. ఇంకా ఇతర డెకరేటివ్ ఐటెమ్స్‌తో బుట్టను అందంగా తయారు చేసుకోవచ్చు.
ఛార్జర్ కేబుల్‌తో పక్షి, నేచర్ పెయింటింగ్ ఆకారం వచ్చేలా అతికించవచ్చు. పాత కార్డ్‌బోర్డుపై ఇలా అతికించి కలర్స్ వేస్తే… అద్భుతంగా తయారవుతుంది. దీంతో గోడకు క్రియేటివ్ లుక్ వస్తుంది.
ఛార్జింగ్ కేబుల్స్, ఇతరత్రా అన్ని రకాల కేబుల్స్‌నీ గుండ్రంగా చుట్టి, పక్షిగూడులా చెయ్యవచ్చు. దాన్ని వరండాలో వేలాడదీసి, అందులో కొన్ని గింజలు వేస్తే… పక్షులు వచ్చి తింటాయి. ఇలా ఎన్నో రకాలుగా వాడుకునేందుకు వీలు ఉంటుంది.