తెలంగాణను మరో పంజాబ్ గా మార్చకండి : రేవంత్ రెడ్డి

-

తెలంగాణను మరో పంజాబ్ గా మార్చకండని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ గుట్కా లేదు, మట్కా లేదు అని కేసీఆర్ చెప్పారని.. కానీ గల్లీ గల్లీలో గంజాయి గుప్పు మంటుంది అని నేను అప్రమత్తం చేశానని పేర్కొన్నారు. ఈ గుట్కా , మట్కా , డ్రగ్స్ పై నిఘా లేక పోతే మరో పంజాబ్ అవుతుందని ప్రభుత్వం ను హెచ్చరించానని.. చిన్నారి పై జరిగిన లైంగిక దాడి, గంజాయి మత్తులో జరిగిందని ఒక వైపు ప్రభుత్వం చెపుతుందని ఫైర్ అయ్యారు.

గుడుంబా ను నిషేదించాము అని చెప్పారని.. పాఠశాల నుండి కళాశాల వరకు గంజాయి విస్తరించిందని మండిపడ్డారు.. జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ లో మాత్రమే ఉండే ఈ పబ్ లు.. ఇప్పుడు తాజాగా 90 పబ్ లకు అనుమతి ఇచ్చారని అగ్రహించారు. 2017 లో డ్రగ్స్ కేసులో 12 FiR లు నమోదు చేసి హడావుడి చేశారని.. అప్పట్లో ఇన్వెస్ట్ గేషన్ చేసిన అధికారి ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు తెలియదని మండిపడ్డారు.

ఆ కేసును రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టింది.. 2019 లో నేను స్వయంగా ఈ డ్రగ్స్ కేసుల పై విచారణ చేయాలని హైకోర్టు ను ఆశ్రయించానన్నారు. 2017 నుండి 2022 వరకు జరిగిన డ్రగ్స్ కేసులు పై డిజిటల్ డేటా సేకరించాలని ఫిర్యాదు చేశానని.. తెలంగాణ రాష్ట్రాన్ని మరో పంజాబ్ గా మార్చకండి అని నేను డిమాండ్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పంజాబ్ లో డ్రగ్స్ కు అలవాటు పడి , బానీసలై రాష్ట్రం నిర్వీర్యం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version