రేవంత్ ఆపరేషన్..ఎవరిని వదలరా..?

-

టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..తమ ప్రత్యర్ధులుగా ఉన్న టీఆర్ఎస్-బీజేపీలపై పోరాటం చేయాలో లేక సొంత పార్టీలో ఉండే ప్రత్యర్ధులపై పోరాటం చేయాలో తెలియని పరిస్తితి ఉందని చెప్పొచ్చు..రేవంత్ ఏదైనా కార్యక్రమం చేసిన, ఏదైనా నిర్ణయం తీసుకున్న మొదట విమర్శలు వచ్చేది సొంత పార్టీ నుంచే. అయితే సొంత పార్టీకి వాళ్ళకు ఘాటుగా కౌంటర్లు ఇచ్చే విషయంలో రేవంత్ ఆచి తూచి వ్యవహరిస్తూనే వాచ్చరు.

కానీ అది మొన్నటివరకే మునుగోడు ఉపఎన్నిక తర్వాత రేవంత్ తన వర్షన్ మార్చుకుంటున్నారు. సొంత పార్టీలో ఎవరైనా విమర్శలు చేస్తే కాస్త ఆగేవారు. కానీ ఇంకా ఆగడం లేదని తెలుస్తోంది. కొందరు నేతలు కోవర్టులు మాదిరిగా పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తున్నారనే విషయం తెలిసిందే. అలాంటి వారే రేవంత్‌పై విమర్శలు చేస్తూ, ఆయనకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. మొన్నటివరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ స్థాయిలో రేవంత్‌ని తగులుకున్నారో చెప్పాల్సిన పని లేదు.

కానీ వెంకటరెడ్డి విషయంలో ఎలాంటి లూప్ దొరక్క రేవంత్ ఆగారు. మునుగోడు ఉపఎన్నికలో తన సోదరుడు, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్  రెడ్డికి ఓటు వేయాలని వెంకన్న మాట్లాడినా ఆడియోలు బయటకొచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇంకా ఆయన కోసం ఎవరు సపోర్ట్ గా మాట్లాడినా రేవంత్ ఉపేక్షించడం కష్టమే. అలాగే తాజాగా జూమ్ మీటింగ్ పెట్టగా, కొందరు అధికార ప్రతినిధులు హాజరు కాలేదు. వారికి కూడా పి‌సి‌సి నుంచి నోటీసులు వెళ్ళాయి.

అటు మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడానికి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక మర్రికి మద్ధతుగా జగ్గారెడ్డి మాట్లాడారు. అయినా సరే జగ్గారెడ్డి మాటలని రేవంత్ పట్టించుకోలేదు. తాజాగా రాష్ట్రంలో భూ సమస్యలు, అర్హులకు అసైన్డ్‌ పట్టాలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తెలంగాణలో కౌలు రైతు చట్టాన్ని అమలు చేయాలని సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చారు.

తాజాగా కాంగ్రెస్ పరిస్థితిపై పార్టీ అనుబంధ సంఘాల సమీక్ష నిర్వహించారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై.. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అనుబంధ సంఘాలను కోరారు…ఇకపై రానున్న రోజుల్లో ఎన్నికలే టార్గెట్ గా రేవంత్ ముందుకెళ్లనున్నారు. సొంత పార్టీ నుంచి ఎలాంటి విమర్శలు వచ్చిన ఇంకా పట్టించుకునేలా లేరు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version