ఎమ్మెల్యే వనమాను టీఆర్‌ఎస్‌ ను నుంచి సస్పెండ్‌ చేయండి : రేవంత్‌ రెడ్డి ఫైర్‌

కొత్తగూడెం టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాల్‌ చల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ వ్యవహారం పై తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ దీనిపై స్పందించి.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ తన భార్యను పంపమని ఆదేశించాడని మృతుడు రామకృష్ణ సెల్ఫీ వీడియో లో చెప్పారని.. ఈ దారుణాన్ని తట్టుకోలేక రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రామకృష్ణ యొక్క ఆశ్చర్యకరమైన చివరి సెల్ఫీ వీడియో వనమా రాఘవేంద్ర S/O కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రావు యొక్క దౌర్జన్యాలను వెల్లడిస్తుందని ఫైర్‌ అయ్యారు.

అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని తాను డిమాండ్ చేస్తున్నానని.. ఎమ్మెల్యే ను టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు రేవంత్ రెడ్డి. కాగా.. ఈ సంఘటనపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌ అయింది. దీంతో స్వయంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది.