టీఆర్ఎస్ పార్టీ , సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే అంటూ… టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నాడని.. మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని ఆయన అన్నారు. అమరవీరుల కుటుంబాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని… 1569 మందిని గుర్తించి ఉద్యోగ అవకాశాలు, డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరవీరులను టీఆర్ఎస్ ప్రభుత్వం అవమానపరుస్తోందని ఆయన విమర్శించారు.
టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ఇదే…. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-