అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రాజీవ్ రైతు భరోసా దీక్ష కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుండి ఆయన పాదయాత్రగా హైదరాబాద్ బయలుదేరారు. అంతకు ముందు రాజీవ్ రైతు భరోసా దీక్ష వేదిక వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు కోట్ల రూపాయల సంపాదన కోసం వ్యవసాయం చేయడని అన్నారు. సీలింగ్ చట్టం తెచ్చి బలహీన వర్గాలకు భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదన్న ఆయన రైతు పండించిన పంటలకు ధరలు రాక ఆత్మహత్యలు కుంటుంటే రైతుల నడ్డి విరిచే చట్టాలను తెచ్చిన ఘనత మోడీదని అన్నారు.
ఆదాని, అంబానీలు,అమెజాన్ లకు తాకట్టు పెట్టె ప్రయత్నం చేస్తుంటే దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్దిస్తున్నాడని విమర్సిన్హారు. రైతన్నల కోసం అచ్చంపేట నుండి రైతు భరోసా యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తా….అచ్చంపేట నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. ఢిల్లీపై పోరాటం చేస్తాం అని రోడ్డు పైకి వచ్చిన కేసీఆర్ డిల్లీ పోయి ఎందుకు చేయి చేయి కలిపాడని ప్రశ్నించారు.