ఖమ్మం సభలాగే చేవెళ్ల సభనూ విజయవంతం చేయాలి : రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ చేవెళ్లలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన సభ ఈనెల 26న జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. బహిరంగ సభలో పాల్గొననున్న ఖర్గే సభా వేదికపై నుంచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు.ఈనెల 21 నుంచి 25 వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేసేలా కృషి చేయాలన్నారు. ‘తిరగబడదాం.. తరిమికొడదాం’ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతీ గడపకు చేరాలి… ప్రతీ తలుపు తట్టేలా చూడాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్లమెంట్ వారీగా కోఆర్డినేటర్లను నియమించామన్నారు. 29న మైనారిటీ డిక్లరేషన్ వరంగల్‌లో విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు. మేనిఫెస్టో విడుదలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల రోజులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఏం చేయబోతుందో ప్రజలకు వివరిద్దామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version