రేవంత్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ??

-

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారంట వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టి రేవంత్ రెడ్డి పార్టీ పెట్టబోతున్నారని నిన్నటి నుంచి ఈ వార్త వైరల్ అవుతుంది. ఈ ప్రచారంతో రేవంత్ రెడ్డి వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలపై సీరియస్ గా రియాక్ట్ అయింది.

ఎవరో కావాలని తమ నాయకుడిపై కుట్రపడ్డారంటూ రేవంత్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా దృశ్చర్యలకు పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ వార్తలపై పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. తమ నాయకుడు కొత్త పార్టీ పెడుతున్నారంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారని సమాచారం అందుతుంది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version