వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న నిరసన గురించి అందరికీ తెలిసిందే. 70రోజులకి పైగా రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలనీ, దానివల్ల రైతు నష్టపోతాడని, తక్షణమే వాటిని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 70రోజులకి పైగా సాగుతున్న ఈ నిరసనకి సింగర్ రిహన్నా మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు. దీంతో ఆమె ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మనదేశంలో రైతుల నిరసనపై సెలెబ్రిటీలు ఎలాంటి కామెంట్స్ చేయకపోయినప్పటికీ, ఇతర దేశస్తురాలైన రిహన్నా కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
ఈ నేపథ్యంలో ట్విట్టర్ తో పాటు గూగుల్ లోనూ రిహన్నా ట్రెండింగ్ లో ఉంది. ఐతే రిహన్నా గురించి సెర్చ్ చేసిన వారందరూ ఆమె మతం ఏంటని, ముస్లిమా? పాకిస్తానీయా అని సెర్చ్ చేసారట. ఈ మేరకు గూగుల్ కీ వర్డ్స్ లో ఇవే ఎక్కువగా ఉన్నాయట. రిహన్నా కామెంట్స్ కి కొందరు మద్దతు తెలపగా, మరికొందరేమో ఇతర దేశాల వాళ్ళ సమస్యల్లో జోక్యం చేసుకోవద్దనే విషయం తెలుసుకోవాలని చెబుతున్నారు.