ఆ సవాళ్లు అధిగమించడానికే నా తొలి ప్రాధాన్యం : రిషి సునాక్‌

-

ఆర్ధిక సంక్షోభం చుట్టుముడుతుందనే భయాల నడుమ ఆర్ధిక స్ధిరత్వం, ఐక్యత తన ప్రాధాన్యాలని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పష్టం  చేశారు. తాను ఎంతో రుణపడి ఉన్న దేశానికి తాను చేయాల్సిన పనులు చేపట్టడానికి ఇది తన జీవితంలో దక్కిన గొప్ప అవకాశమని పేర్కొన్నారు. బ్రిటన్‌ ప్రధానిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్న రిషి సునాక్‌ ఎన్నికల ఫలితాల అనంతరం తొలి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

“మనం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించి మన పిల్లలు, రాబోయే తరాలను సుసంపన్నం చేసేందుకు, మెరుగైన భవిష్యత్‌ అందించేందుకు మనకు స్ధిరత్వం, ఐక్యత అవసరమని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీని, దేశాన్ని ఏకతాటిపై ముందుకు నడపడమే తన ముందున్న కర్తవ్యం.” అని స్పష్టం చేశారు.

బ్రిటిష్ పౌరులకు మెరుగైన సేవలందించేందుకు సమగ్రత, అంకితభావంతో కష్టపడి పనిచేస్తానని రిషి సునాక్ హామీ ఇచ్చారు. 357 మంది ఎంపీల్లో సగానికి పైగా ఎంపీలు.. భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ వెన్నంటి నిలిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version