అబూదాబి వేదికగా ఈ రోజు ఇండియా ఆఫ్ఘనిస్థాన్ మధ్య టీ ట్వంటి ప్రపంచ కప్ సందర్భంగా మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రత్యర్థులు అయిన ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. రోహిత్ శర్మ తాజాగా ఆర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నారు. 37 బంతుల్లోనే 53 పరుగులు చేసి అజేయం గా కొనసాగుతున్నాడు.
అర్థ శతకాన్ని రోహిత్ 7 ఫోర్లు, ఒక సిక్స్ తో పూర్తి చేశాడు. అలాగే 148.72 స్ట్రైక్ రేట్ తో రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. అయితే రోహిత్ శర్మ గత రెండు మ్యాచ్ లలో దారుణంగా విఫలం అయ్యాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో అయితే రోహిత్ శర్మ గొల్డెన్ డౌక్ అవుట్ తో వెను తిరిగాడు.
అలాగే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ ఆశించిన స్థాయి లో ఆడలేదు. న్యూజిలాండ్ పై 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్ శర్మ పై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతన్న మ్యాచ్ లో రోహిత్ శర్మ విరుచు కుపడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ శతకం కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.