టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనక పెద్దల హస్తం ఉందని ఆరోపించారు టిపిసిసి రేవంత్ రెడ్డి. పేపర్ లీకేజీ లో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో పలు పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీలోనే ఉద్యోగాల కొరత ఉందన్న రేవంత్.. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయన్నారు. వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం తరపు నుండి ఫిర్యాదు లేదని.. ఈ ఘటనపై విచారణ చేపడితే ప్రభుత్వంలోని పెద్దలు దొరుకుతారనే పేపర్ లీకేజీ పై ప్రభుత్వం ఫిర్యాదు చేయడం లేదని ఆరోపించారు. పేపర్ లీకేజీ పై ఫిర్యాదు అందకున్నా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.