ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ నరసాపురం సభ సాగింది. అక్కడ పలు కార్యక్రమాలని ప్రారంభించడానికి వచ్చిన జగన్..పూర్తిగా చంద్రబాబు, పవన్‌లని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. బాబు, పవన్ కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇద్దరినీ ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇంకా టీడీపీ నటే తెలుగు బూతుల పార్టీ అని, జనసేన అంటే రౌడీ సేన అని అన్నారు.
ఇక జగన్ చేసిన వ్యాఖ్యలపై, టీడీపీ, జనసేనల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. అసలు బూతులు మాట్లాడటం గురించి, రౌడీయిజం గురించి జగన్, వైసీపీ నేతలు మాట్లాడటమే పెద్ద విడ్డూరంగా ఉందని కౌంటర్లు వస్తున్నాయి. ఇదే క్రమంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ తనదైనలో జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.
“జనసేన ఎందుకు రౌడీ సేన? జగన్ గారూ
మీ అసమర్థత వల్ల ఉసురు తీసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నందుకా? మీకు గుడ్ మార్నింగ్ చెప్పి రోడ్ల దుస్థితిని తెలిపినందుకా?”
“జనసేన ఎందుకు రౌడీ సేన? జగన్ గారూ
మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?” అంటూ ట్విట్టర్ వేడిగా కౌంటర్లు ఇచ్చారు.
అటు టీడీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి..టీడీపీని బూతుల పార్టీ అనడంపై ఫైర్ అవుతున్నారు. అసలు బూతులపై పేటెంట్ హక్కులు అన్నీ వైసీపీవే అని, బూతుల పంచాగం మొదలుపెట్టింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని, ఇంకా రౌడీ రాజ్యం గురించి చెప్పాల్సిన పని లేదని సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. అయినా బూతులు, రౌడీయిజం అనేది ఇప్పుడు రాజకీయాల్లో కామన్ అయిపోయింది. మరి వీటిల్లో ఆరితేరిపోయి ఉంది ఎవరో ప్రజలకు క్లారిటీ ఉంది.