RRR to Sitaramam: ఈ జంటల ఆన్​స్క్రీన్​ కెమిస్ట్రీ సూపర్​హిట్​.. మనసు దోచేశారు!

-

ఓ సినిమా ఎక్కువ మందికి రీచ్​ అవ్వాలంటే… ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు అందులో చాలానే ఉంటాయి. మంచి సాంగ్స్​, మ్యాజిక్​, డైలాగ్స్​, ఫైట్స్​, స్క్రీన్​ ప్లే, హీరోహీరోయిన్ పెయిర్​​.. ఇలా ప్రతిఒక్కటి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అప్పుడే సినిమా సూపర్​ హిట్​ అవుతుంది. ఒకవేళ ఆ మూవీ లవ్​స్టోరీ అయితే మాత్రం హీరో, హీరోయిన్​ పెయిర్, వాళ్ల ఆన్​స్క్రీన్​ కెమిస్ట్రీ మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలి. అప్పుడే అది మరింత హైరేంజ్​లో సక్సెస్​ సాధించి ప్రేక్షకుల మదిని తాకుతుంది. మూవీని మరోస్థాయికి తీసుకెళ్తుంది.

అయితే లవ్​స్టోరీయా లేదా ఇతర జానరా అనేది పక్కనపెడితే.. దాదాపుగా ప్రతీ సినిమాలో హీరో, హీరోయిన్​కు మధ్య ఓ లవ్​ట్రాక్​ ఉంటుంది. కానీ వాళ్లలో కొన్ని జంటల మధ్య కెమిస్ట్రీ మాత్రమే బాగా వర్కౌట్​ అవుతుంది. అవే మనల్ని బాగా ఆకట్టుకుంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతగా వాళ్ల ఆన్​స్క్రీన్ కెమిస్ట్రీ పండి మనసుల్ని తాకుతాయి. సినిమాను మరోసారి చూడాలనే ఆసక్తిని పెంచుతాయి. ఎందుకంటే ఆ హీరోహీరోయిన్​ తెరపై ఆ రేంజ్​లో​​ మ్యాజిక్​ చేస్తారు. ఎంతలా అంటే వాళ్లు నిజంగానే రియల్​ లైఫ్​ కపుల్సా అనిపించేలా చేస్తుంటారు. వాళ్ల కెమిస్ట్రీతో మనం ప్రేమలోకంలో మునిగి తేలేలా చేస్తారు

మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హిట్​, ఫ్లాఫ్​తో సంబంధం లేకుండా​.. ఆ జోడీ మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మదిలో ఉండిపోతుంది. మళ్లీ ఆ పెయిర్ కలిసి​ ఎప్పడు స్క్రీన్ షేర్​ చేసుకుంటారా అని ఎదురు చూసేలా చేస్తుంది. అలా రీసెంట్​గా విడుదలైన సినిమాల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కొన్ని ఆన్​స్క్రీన్​ పెయిర్స్​ ఎంతో చూద్దాం…

ఎన్టీఆర్​-ఒలివియా.. ‘ఆర్​ఆర్​ఆర్’​ మూవీ.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ఈ భారీ చిత్రం.. రాజమౌళి టేకింగ్, హీరోలిద్దరి నటన, గ్రాఫిక్స్​తో కూడిన ప్రతిసన్నివేశం..​ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఇక ఎన్టీఆర్​ నటనైతే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఈ చిత్రంలో యంగ్​ టైగర్​ .. హాలీవుడ్​ బ్యూటీ ఒలివియాతో మోరిస్​ ఆన్​స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా రిలీజ్​ కాకముందే నుంచే టీజర్​, పోస్టర్స్​తో వీరిద్దరి పెయిర్ ఆకట్టుకుంది. నాటునాటు సాంగ్​తో సహా సినిమా మొత్తంలో ఈ జంట ఆన్​స్క్రీన్​ కెమిస్ట్రీ, సంభాషణలు, సన్నివేశాలు, స్క్రీన్​ ఎప్పియరెన్స్​ వీక్షకుల్ని హత్తుకుంది.

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అంటే.. సుందరానికీ. దర్శకుడు వివేక్ ఆత్రేయ తనదైన మార్క్ కామెడీ రొమాంటిక్ తెరకేకించారు. మలయాళ బ్యూటీ నజ్రియా ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో లేన్నప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా డీలా పడింది. అయితే ఈ సినిమాలో నాని, నజ్రియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది., వారి మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాకి ప్లస్.

సీతారామం… ప్రేమ‌క‌థ‌ల‌కు ప్రధాన జోడీ మ‌ధ్య కెమిస్ట్రీ కీల‌కం. ఆ విష‌యంలో దుల్కర్‌, మృణాల్ మంచి ప్రతిభ‌ చూపించారు. దుల్కర్ క‌ళ్లతోనే భావాల్ని ప‌లికించాడు. మృణాల్ ఠాకూర్ రాణిలా క‌నిపిస్తూనే చ‌క్కటి భావోద్వేగాల్ని పండించింది. ఆమె న‌ట‌న సినిమాకు హైలైట్‌. హను రాఘవుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ విజయవంతంగా ఆడుతోంది.

నక్సలిజం, రాజకీయం, ప్రేమ.. నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల తెరకెక్కించిన ఈ సినిమాలో రానా-సాయిపల్లవి జంట ప్రేక్షకుల్ని హత్తుకుంది. ముఖ్యంగా రానా కోసం సాయిపల్లవి చేసే సాహసాలు, నటన, డైలాగ్​లు ఆకర్షించాయి. కానీ ఈ చిత్రం కథ పరంగా అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయింది.

డీజే టిల్లు.. థియేటర్లలో ఇటీవల విడుదలై, యువతను అమితంగా ఆకట్టుకున్న చిత్రం ‘డీజే టిల్లు’. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ సినిమా అదిరిపోయే హిట్​ను అందుకుంది. ఇందులో టిల్లు.. సింగ‌ర్ అయిన రాధిక (నేహాశెట్టి)ని తొలిసారి చూడ‌గానే ఇష్టప‌డ‌తాడు. ఆమెకి త‌న‌దైన శైలిలో మాట‌లు చెబుతూ చెలిమి చేస్తాడు. అలా వీరిద్దరు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ మధ్య జరిగే సంభాషణలు, కెమిస్ట్రీ, ముఖ్యంగా సిద్ధు నటన ప్రేక్షకుల్ని బాగా అలరించింది. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్​ తెరకెక్కనుంది.

ఇప్పటికే ఆకట్టుకున్న కొన్ని ఆన్​స్క్రీన్​ పెయిర్స్​ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాయి. మహానటి సినిమాతో అలరించిన విజయ్​దేవరకొండ-సమంత.. త్వరలోనే ఖుషి సినిమా ద్వారా అభిమానుల్ని అలరించనున్నారు. ఈ సినిమా కశ్మీర్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథతో రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్​ సినిమాపై ఆసక్తిని పెంచింది.
నేను లోకల్​తో అలరించిన నాని-కీర్తిసురేశ్​ త్వరలోనే దసరాతో పలకరించనున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతోందీ చిత్రం.

Read more RELATED
Recommended to you

Exit mobile version