రవితేజ “RT 69” నుండి అదిరిపోయే అప్డేట్..!

-

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా విజయంతో ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న రవితేజ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ తేదీని ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1 నుండి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సినిమాల్లో సెంటిమెంట్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి చంటబ్బాయి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో రవితేజ డిటెక్టివ్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో రవితేజ కామెడీ తో అలరించబోతున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమా లో నటీనటుల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడికి జోడిగా నటిస్తున్న హీరోయిన్ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది.

https://twitter.com/RaviTeja_offl/status/1444174577295249423?s=19

Read more RELATED
Recommended to you

Exit mobile version