ఆ గుడిలో ప్రసాదం గురించి తెలిస్తే అస్సలు వెళ్లరు..ఎందుకంటే?

-

సాదారణంగా గుడిలో ప్రసాదంగా పులిహోర, దద్దొజనం, లేదా చక్కర పొంగలి ఇవ్వడం చూసి ఉంటాము.. అక్కడ ఇచ్చే ప్రసాదం చాలా రుచిగా ఉంటుంది. అందుకే గుడికి వెళ్లిన వాళ్ళు దేవుడిని మొక్కుకున్నా లేకున్నా కూడా ప్రసాదం మాత్రం మర్చిపొరు.. ఆ టెస్ట్ వేరు.. అందుకే కొన్ని సామెతలు కూడా ఉన్నాయి. ఇది కొన్ని ప్రాంతాల్లొ పెట్టె ప్రసాదాలు మాత్రమే.. మరి కొన్ని ప్రాంతాల్లొ మాత్రం నాన్ వెజ్ ను నైవెద్యంగా పెడతారు.. ఏంటీ పవిత్రమైన గుడిలో నాన్‌వేజ్‌ ఎలా పెడతారనే సందేహం మీకు రావడం సహజం..కానీ ఇది నిజం..నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వింత ఆచారాలు ఉన్నాయి..

ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వార్త వింటే ఎవరైనా కూడా షాక్ అవ్వాల్సిందే.. ఓ గుడిలో పీతలను ప్రసాదంగా పెడుతూన్నారు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా అది నిజమే అని చెప్పాలి.బతికిన పీతలను ప్రసాదంగా ఇస్తారు. మీరు సరిగ్గానే విన్నారు.. అక్కడ ప్రసాదంగా ఇచ్చేది అక్షరాలా పీతలే.. అంతేకాదు..అక్కడ చనిపోయినవారికి ఇష్టమైన వస్తువులను సమాధుల వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. వామ్మో ఇదేం ఆచారం రా బాబూ..అదెక్కడో వివరంగా తెలుసుకుందాం..

గుజరాత్‌ లోని రుంద్‌నాథ్‌ మహదేవ్‌ శివాలయంలో పూలు పండ్లతోపాటు బతికున్న పీతలతో అభిషేకం చేస్తారు..ఏడాదికోసారి జరిగే ఈ జాతరకు వేలాది భక్తులు తరలివస్తారు.ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్ళుగా అక్కడ కొనసాగుతుంది.. అప్పుడు కొన్ని వేల మంది దేవుడిని దర్షిస్తారు. సూరత్‌లోని రామ్‌నాథ్‌ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయంలో మాఘమాస ఏకాదశి రోజున ఏడాదికోసారి భక్తులు బ్రతికున్న పీతలను నైవెద్యంగా సమర్పిస్తారు. అలా ఇవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయని వారి నమ్మకం. చనిపొయిన వారికి కూడా ఇష్టమైనవి సమర్పించి ప్రార్దనలు కూడా చేస్తారు. ఇది నిజంగా వింతనే.. ఆ పీతల కోసం జనాలు కొట్టుకోవడం కూడా చేస్తారట..ఏంటో మరి..

Read more RELATED
Recommended to you

Exit mobile version