రష్యాలో కరోనా కల్లోలం… రోజుకు 40 వేలకు పైగా కేసులు

-

కరోనా రష్యాను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజల్ని వణికిస్తోంది. రోజూ 40 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇది ఈ దేశ జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువ. గడిచిన 24 గంటల్లో రష్యాలో కొత్తగా 40735 కేసులు నమోదయ్యాయి. రష్యాలోని 85 రిజీయన్లలో కరోనా తీవ్రత పెరిగింది. దీంతో అన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు రష్యాలో 87,14,595 కేసులు నమోదయ్యాయి. 2,44,447 మంది బాధితులు ఇప్పటి వరకు మరణించారు. అయితే కరోనాకు వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ని కనిపెట్టిన దేశంగా రికార్డుల కు ఎక్కిన రష్యా.. కరోనా కేసులను మాత్రం అదుపు చేయలేకపోతోంది. రష్యా రాజధాని మాస్కోతో పాటు సెంయింట్ పీటర్స్ బర్గ్ నగరాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటికే యూరప్, రష్యా దేశాల్లో రానున్న వారాల్లో కరోనా కేసులు పెరుగుతాయని  WHO తెలిపింది. ఫిబ్రవరి కల్లా యూరప్ ప్రాంతంతో 5 లక్షల మరణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version