కూతురు గ్రాడ్యుయేషన్ డే.. భావోద్వేగానికి గురైన సచిన్!

-

సచిన్ టెండుల్కర్… క్రికెట్ రారాజు. భారతదేశానికి సరికొత్త క్రికెట్ ను పరిచయం చేశాడు. ప్రపంచానికి భారత క్రికెట్ సత్తాను చాటాడు. అందుకే ఆయన క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకం. ఆయన ఇప్పుడు క్రికెట్ కు దూరమైనా.. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఇప్పటికీ ఆయనను క్రికెట్ దేవుడిగానే కొలుస్తుంటారు. ఇప్పుడు భారత్ తరుపున క్రికెట్ ఆడే యువ ఆటగాళ్లు కూడా సచిన్ మార్గదర్శనంలోనే నడుస్తున్నారంటే అది సచిన్ గొప్పతనం.

సచిన్ క్రికెట్ చరిత్రలో రారాజుగా నిలిచిపోవడానికి ఆయన ఫ్యామిలీ పాత్ర కూడా ఎంతో ఉంది. అందుకే సచిన్ కు తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా తన కూతురు గ్రాడ్యుయేషన్ డే రోజున భావోద్వేగానికి గురయ్యాడు సచిన్. సారా లండన్ యూనివర్సిటీ కాలేజీలో మెడిసిన్ ను పూర్తిచేసుకుంది. దీంతో తన గ్రాడ్యుయేషన్ డే రోజున లండన్ వెళ్లిన సచిన్, అంజలి తన కూతురుతో కలిసి గ్రాడ్యుయేషన్ సంబురాలను జరుపుకున్నారు.

సారా పట్టా అందుకున్న సందర్భంగా సంతోషంలో సచిన్ అక్కడ దిగిన ఫోటోలతో పాటు ఓ ట్వీట్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లోనూ ఫోటో షేర్ చేశాడు. సారా కూడా తన గ్రాడ్యుయేషన్ డే ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.

నిన్ననే నువ్వు ఇంటి నుంచి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు గ్రాడ్యుయేట్ వి. నేను, అంజలి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. వెళ్లు.. నీ లక్ష్యం కోసం వెళ్లు.. ఈ ప్రపంచాన్ని జయించు సారా.. అంటూ సచిన్ చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. సారా గ్రాడ్యుయేషన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version