Yashoda : యశోద సినిమా సక్సెస్ పై సమంత ట్వీట్

-

యశోద సినిమా సక్సెస్ పై సమంత ట్వీట్ చేశారు. ‘యశోద’ పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు సమంత. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.. ‘యశోద’ చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. ఈ సక్సెస్ వెనుక మా చిత్ర బృందం నిర్విరామ కృషి ఉంది.. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది.. నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

Samantha Prabhu's Upcoming Films: From Her Bollywood Debut With Taapsee  Pannu To Kushi and Others

దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందానిచ్చింది.’ అని రాసుకొచ్చారు సమంత. అయితే.. ఇటీవల సమంత నటించిన యశోద సినిమా విడుదల అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు సమంత.

Read more RELATED
Recommended to you

Latest news