చైనాకు షాకిచ్చిన శాంసంగ్ మొబైల్స్.. ఫ్యాక్టరీ ఇండియాకు తరలింపు.

-

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు చైనాకు షాక్ ఇస్తూ వస్తున్నారు. కారణాలేవైనా చైనా నుమ్డి తమ ఫ్యాక్టరీలని తరలిస్తున్నారు. తాజాగా శాంసంగ్ మొబైల్స్ కూడా ఆ జాబితాలోనే చేరింది. శాంసంగ్ మొబైల్స్ డిస్ ప్లే తయారీ యూనిట్ ని చైనాలో నిర్మించాలని శాంసంగ్ చూసింది. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ యూనిట్ ని ఇండియాలోని నోయిడాకు మార్చింది. ఆల్రెడీ నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఈ ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది.

ఈ మేరకు శాంసంగ్ మొబైల్స్ నైరుతి ఆసియా అధ్యక్షుడు కెన్ కాంగ్ ప్రెస్ నోట్ విడుదల చేసారు. నోయిడా ప్రాంతం గురించి మాట్లాడిన అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ వ్యాపార విధానాలు బాగున్నాయని, నోయిడా ప్రాంతం వ్యాపారానికి తగిన చోటు అని, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version