SBI సూపర్ స్కీమ్.. ఒక్కసారి డబ్బులను పెడితే రూ.32 లక్షలను పొందవచ్చు..

-

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ ను చెప్పింది..ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని అందిస్తోంది. ఇందులో చేరితే అదిరే బెనిఫిట్ పొందొచ్చు.. ఆ పథకం పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..ఎస్‌బీఐ సర్వోత్తం పేరుతో టర్మ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. ఇధి రెండు రకాల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నాన్ క్యాలబుల్, క్యాలబుల్ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో నాన్ క్యాలబుల్ ఆప్షన్ ఎంచుకొని డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే..మీరు మంచి లాభాలను అందుకోవచ్చు..

ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.9 శాతం వడ్డీని అందిస్తోంది. రెండేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ ఈ మేరకు వడ్డీ పొందొచ్చు. అదే రెగ్యులర్ కస్టమర్ల అయితే వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. ఇది మంచి ఆధాయాన్ని అందిస్తుంది.అదే విధంగా ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్‌కు ఇది వర్తిస్తుంది. అదే రెగ్యులర్ కస్టమర్లు అయితే వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.. అయితే ఈ బ్యాంకు గత నెల 17 నుంచి వడ్డీ రేట్లను సవరించింది..

ఇకపోతే ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ కూడా తెచ్చింది. అమృత్ కలాష్ డిపాజిట్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ స్కీమ్‌పై కూడా సీనియర్ సిటిజన్స్‌కు 7.6 శాతం వడ్డీ వస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు 7.1 శాతం వడ్డీని అందిస్తుంది..మీరు సర్వోత్తం ఎఫ్‌డీ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చెయ్యాలనుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి..కనీసం రూ. 15 లక్షల నుంచి డబ్బులు దాచుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. పదేళ్లలో చేతికి రూ. 32 లక్షలు వస్తాయి.. ఈ స్కీమ్ లో రెండేళ్ల వరకు ఉంచాలి.. అప్పుడే అధిక రాబడిని పొందుతారు… ఇవే కాదు ఎన్నో స్కీమ్ లను బ్యాంకు అందిస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version