కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇండియన్ సైంటిస్టులు సెలైన్ గార్గిల్ పద్ధతిని రూపొందించారు..!

-

నాగపూర్ బేస్డ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు సెలైన్ గార్గిల్ ఆర్టిపిసిఆర్ పద్దతిని కనుగొన్నారు. ఈ పద్ధతి లో కనుక కరోనా టెస్ట్ చేస్తే మూడు గంటల్లో ఫలితాలు వస్తాయి. దీని వల్ల చాలా రకాల ఆకర్షణీయమైన బెనిఫిట్స్ కలుగుతాయి.

అవేమిటంటే…? ఈ టెస్ట్ చాలా సింపుల్ మరియు ఎంతో వేగంగా చేయొచ్చు. పైగా దీని ధర కూడా తక్కువే. అదే విధంగా ఈ టెస్ట్ ని కంఫర్ట్ గా పేషెంట్స్ చేయించుకోవచ్చు. గ్రామాల్లో మరియు గిరిజన ప్రాంతం లో కూడా ఇవి బాగా పని చేస్తాయి.

అదే విధంగా ఎంతో సౌకర్యంగా ఉపయోగించొచ్చు. కొన్ని కొన్ని సార్లు ఫెసిలిటీస్ లేని చోట టెస్ట్ చేయడానికి శాంపిల్ కలెక్ట్ చేసి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. కానీ ఇది అలా కాదు. ఈ ఆర్టిపిసిఆర్ టెస్ట్ ని సులువుగా చేయొచ్చు.

ఫలితాలు కూడా మూడు గంటల్లో వచ్చేస్తాయి. అయితే దీనిలో సెలైన్ సొల్యూషన్ తో ఒకటి ఫిల్ చేసి ఉంటుంది. దానిని నోట్లో వేసుకుని పుక్కిలించి దానిలో వేయాలి. ఇలా ఎవరికి వాళ్ళు శాంపిల్ తీసుకొని కలెక్ట్ చేసుకుని టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పర్మిషన్ కూడా ఇచ్చేసింది. సులువుగా కరోన టెస్ట్ చేసుకోవడానికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version