ఓయో రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు పెట్టి దంపతులు సన్నిహిత దృశ్యాలు రీకార్డ్‌.. ట్విస్ట్‌ ఏంటంటే..?

-

ఓయో రూమ్‌ అనగానే మన మైండ్‌లో ఏం థాట్స్‌ వస్తాయో అందరికీ బాగా తెలుసు.. అయితే ఓయో రూమ్స్‌ అంటే అందుకు మాత్రమే అని ముద్రపడిపోయింది. తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే..ఇకపై ఓయో రూమ్స్‌కు వెళ్లాలంటే..భయపడతారేమో..! ఓయో హోటల్స్​లో రహస్య కెమెరాలు పెట్టి, దంపతుల సన్నిహిత దృశ్యాలను చిత్రీకరిస్తూ.. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్​ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది..
ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలోని పలు ఓయో హోటల్స్​ను ఈ బృందం టార్గెట్​ చేసుకుంది. కొన్ని రోజుల క్రితం.. వాటిల్లో రూమ్​లు బుక్​ చేసుకుని, చెక్​ ఇన్​ అయ్యింది. ఎవరికీ తెలియకుండా రహస్యంగా కెమెరాలు అమర్చారు గ్రూప్​ సభ్యులు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన్ని రోజులకు.. ఓ ఓయో హోటల్​లో దంపతులు రూమ్​ తీసుకున్నారు. వారు తీసుకున్న రూమ్​లో కెమెరాలు ఉన్నట్టు వారికి తెలియదు. ఆ తర్వాత గదిని వెకేట్​ చేసి వెళ్లిపోయారు.
సీన్‌కట్‌ చేస్తే.. కొన్ని రోజులకు నేరస్థుల బృందం మళ్లీ ఆ ఓయో రూమ్​కి వెళ్లింది. సీక్రట్​ కెమెరాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఓ కెమెరాలో.. దంపతులు సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వారిని ట్రాక్​ చేసింది ఆ బృందం. డబ్బులు ఇవ్వకపోతే, వీడియోలను వైరల్​ చేస్తామని బెదిరించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఇందులో హోటల్​ సిబ్బంది పాత్ర లేదని తేలింది.
విష్ణు సింగ్​, అబ్దుల్​ వాహవ్​, పంకజ్​ కుమార్​, అనురాగ్​ కుమార్​ సింగ్​లు.. మూడు వేరువేరు గ్యాంగ్స్​కు సంబంధించిన వ్యక్తులు. వీరు నోయిడాలో అనేక నేరాలకు పాల్పడ్డారు. నిందితులు విష్ణు, అబ్దుల్​లు.. దంపతులకు వీడియోలు పంపి, డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఉంటారు. లేకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేస్తామంటారు.. రిజిస్టర్డ్​ సిమ్​, బ్యాంక్​ ఖాతాలను మరో నిందితుడు పంకజ్​ సృష్టిస్తాడు. ఇలా వీరు భారీ మొత్తంలో నగదును దోచుకుంటారట.
బయట హోటల్స్‌లో రూమ్‌ తీసుకున్నప్పుడు రూమ్‌ను నిశితంగా తనిఖీ చేయాలి.. సిక్రెట్‌ కెమెరాలు ఎక్కడ ఉంటాయి..మిర్రర్‌ కెమేరాలు కూడా ఉంటాయి. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయంపై సోషల్‌ మీడియాలో బోలెడు సమాచారం ఉంది. ఒకసారి చూస్తే మీకు అవగాహన వస్తుంది.!!

Read more RELATED
Recommended to you

Exit mobile version