దేశ వ్యాప్తంగా మనం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. కానీ కేరళలో మాత్రం ఓ వైపు భారీ వర్షాలు, వరదలతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. 1924వ సంవత్సరం తరువాత ఆ రాష్ట్రంలో మళ్లీ ఇప్పుడే ఆ స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా కేరళలో వార్షిక వర్షపాతం 2924.3 ఎంఎం. కానీ ఈ ఏడాది జూన్ 1 నుంచి నిన్నటి వరకు కేరళలో 30 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో కేరళలో 1606.5 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది. కానీ ఈ సారి అది 2086.8 ఎంఎం గా ఉందంటే.. అక్కడ వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ కారణంగానే అక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా భారీగా వరదలు వస్తున్నాయి.
కేరళలో కొట్టాయం, మళప్పురం జిల్లాల్లో గతేడాది కన్నా 41 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇడుక్కి జిల్లాలో అది 70 శాతంగా ఉంది. కేరళలో ప్రస్తుతం 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే భారీగా ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించింది. 72 మంది వర్షాల కారణంగా అసువులు బాసారు. ఆర్మీతోపాటు ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది రెస్ క్యూ ఆపరేషన్లను కొనసాగిస్తున్నారు. నిరాశ్రయులుగా మారిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
This is exactly how the Cochin Airport looks like now. The walls surrounding have been demolished to clear the water. All operations there suspended #KeralaFloods pic.twitter.com/ijTE10ZTZ5
— Forum Keralam (FK) (@Forumkeralam1) August 15, 2018
నిజంగా కేరళ ఇప్పుడు యావత్ దేశం వైపు చూస్తోంది. తమకు సహాయం అందించే మనస్సున్నమారాజుల కోసం కేరళ వాసుల కళ్లు ఆర్తిగా ఎదురు చూస్తున్నాయి. వారికి మీరు కూడా మీ వంతు సహాయం అందించవచ్చు.
Kerala Chief Minister’s Distress Relief Fund (CMDRF):
Account Number: 67319948232
Bank: State Bank of India
Branch: City Branch, Thiruvananthapuram
IFS Code: SBIN0070028
Donations can also be made online through the CMDRF website:
https://donation.cmdrf.kerala.gov.in