ఓటును అమ్ముకుంటే శవంతో సమానం: జై భారత్

-

మునుగోడు ఉపఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు మునుగోడులో తమ సత్తా చూపాలని సకల ప్రయత్నాలు చేస్తున్నాయి. డబ్బులు, మద్యం, మాంసం పంచుతూ.. తమ పార్టీకే ఓట్లు వేయాలని ప్రచారంలో వేగం పెంచాయి. ఈ క్రమంతో తమ ఓట్లను అమ్ముకోవద్దని, ఓట్లు అమ్ముకుంటే శవంతో సమానమని జై భారత్ సంస్థ ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో డబ్బులు తీసుకోవద్దని పోస్టర్లు ఆవిష్కరించారు. ధన స్వామ్యాన్ని బద్దలు కొట్టి ప్రజా స్వామ్యాన్ని నిలబెట్టాలని నీతి, అర్హత, నిబద్ధత, సమర్ధత వివెచించి ఓటు వేయాలని ఓటర్లను చైతన్యం చేస్తున్నామని జై భారత్ సంస్థ పేర్కొంది. ప్రజలు డబ్బులకు, మద్యానికి బానిసై.. సరైన నాయకుడ్ని ఎన్నుకోవడం లేదని జై భారత్ ఎస్‌సీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్ వెల్లడించారు.

జై భారత్ సభ్యులు

జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శి సుధీర్ మాట్లాడుతూ.. ఓటును అమ్ముకోవదన్నారు. గాంధీ, అంబేడ్కర్, లోహియా కలలు కన్న దేశం ఇదేనా? అని ప్రజలను ప్రశ్నించారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ఉండాలనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ప్రజలు ముందుకు సాగాలన్నారు. సంక్షేమం, సామరస్యం, సామాజిక న్యాయం, సమర్దత వివేచింది ఓటు వేయాలని, మంచి నాయకుడ్ని ఎన్నుకుని దేశాన్ని మార్చుకుందామని పిలుపునిచ్చారు . ఈ ధనస్వామ్య ఎన్నికల వ్యవస్థను ప్రజాస్వామ్య వ్యవస్థగా మార్చేందుకు జై భారత్ అధ్వర్యంలో 11 రాష్ట్రాల్లో 6 భాషల్లో ఓటర్లను చైతన్యం చేసే కార్యక్రమం చేస్తోందన్నారు.

జై భారత్ ఎస్‌సీ పోరాట వేదిక జంట నగరాల ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ.. సీటు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నామినేషన్ నుంచి మొదలుకుని ర్యాలీలో సభల్లో ప్రచారం అంతటా కుల, మత ద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సామాన్యులు చట్ట సభల్లో పోటీ చేసే దిశగా.. కనీసం కన్నెత్తి కూడ చూడలేని పరిస్థితి ఇవ్వాళ నెలకొందన్నారు. ఓటును అమ్ముకోకుండా వివేచించి ఆలోచించి ఓటు వేద్దాం రండి అని రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, సుధీర్, సుధాకర్, జహీర్ ఆజాద్, విష్ణు మూర్తి, దేవానంద్, అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version