ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గాని గురూ టీడీపీ సోషల్ మీడియా చేసే అతి మాత్రం బలే కామెడి గా ఉంటుంది. స్వయానా ఒక టీడీపీ కార్యకర్త ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ మీద చేసిన కామెంట్ ఇది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, టీడీపీ ఎన్డిఎలో ఉన్నప్పుడు, మోడీ తో చంద్రబాబుకి మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఇబ్బందులు పడని ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు కొత్తగా ఇబ్బంది పడతారు అంటుంది.
ఆయనను రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండు అరెస్ట్ చేస్తారూ అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ చేస్తూ ఎవరి సందడి వాళ్ళు చేస్తున్నారు సోషల్ మీడియాలో. రాజకీయంగా ఆ పార్టీని నిలబెట్టుకునే బాధ్యత ఆ పార్టీ కార్యకర్తల మీద ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది సరే. ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడం మానేసి పనికి రాని విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది ఆ పార్టీ సోషల్ మీడియా.
ఎప్పుడో సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ ని విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి వీళ్ళు రాసే రాతలు మరీ ఆశ్చర్యం. రస్ అల్ ఖైమా జగన్ ని అరెస్ట్ చేస్తది, చిరంజీవికి జగన్ అందుకే రాజ్యసభ ఇస్తున్నారు. నాగార్జున ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని ఎవరికి తోచిన రాతలు వాళ్ళు వాళ్ళు రాస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, కేంద్రంతో పరోక్ష సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తి,
ఆ మాత్రం తనను తాను కాపాడుకోలేడా…? సెర్బియా పోలీసులు జగన్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కొత్త ప్రచారం మొదలుపెట్టారు. కేంద్రం మీద వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారట. అదో గల్ఫ్ దేశం. భారత్ తో మహా అంటే వేల కోట్ల వ్యాపారం చేస్తుంది. మన దేశం నుంచి కొన్ని ఎగుమతులు ఉన్నాయి ఆ దేశానికి. అలాంటి దేశం ఎందుకు ఒత్తిడి తెస్తుంది. ఇలాంటివి పక్కన పెట్టి పార్టీని బ్రతికిన్చుకుంటే మంచిది అంటూ పలువురు సూచిస్తున్నారు.