గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పేరిట లైంగిక వేధింపులు.. టీచర్ అరెస్టు!

-

విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టీచర్ వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. రాష్ట్రంలోని లలిత్‌పూర్ జిల్లాలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ‘ గురించి చెబుతున్న క్రమంలో ఓ కీచక టీచర్ చిన్నారులను అసభ్యంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందాడు. దీనిని మరో టీచర్ గుర్తించి ఆ ఊరి గ్రామపెద్దలకు ఫిర్యాదు చేశాడు.

1 నుంచి 3 తరగతుల బాలికలను టీచర్ ఇలా లైంగికవేధింపులకు గురిచేస్తున్నట్లు తేలింది. తమతో తరచుగా టీచర్ అలా చేశారని పలువురు చిన్నారులు సైతం అంగీకరించారు. దీంతో గ్రామపెద్దల ఆధ్వర్యంలో చిన్నారుల తల్లిదండ్రులు లలిత్‌పూర్‌లోని తల్‌బేహాట్ పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడి ఉపాధ్యాయుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news