ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉంది – షబ్బీర్ అలీ

-

కామారెడ్డి లో ఆందోళన జరుగుతుందని.. రైతులు రోజు ధర్నాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని మండిపడ్డారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డిలో 620 ఎకరాలు ఇండస్ట్రీ జోన్ లో కలిపారని ఆరోపించారు. దీనివల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. రైతులు రోడ్డెక్కిన కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ కూడా పట్టించుకోవడంలేదని ఆరోపించారు షబ్బీర్ అలీ.

అలాగే పిజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చాక్లెట్ ఇస్తుందని.. కాంగ్రెస్ పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుందన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్తో 1500 మంది డాక్టర్లు అయ్యారని అన్నారు. 12 % రిజర్వేషన్ అన్న కేసిఆర్ ఎప్పుడు ఏమైందని ప్రశ్నించారు. దళితుల కంటే కూడా మైనారిటీలు వెనకబడి ఉన్నారని అన్నారు. కెసిఆర్ మైనారిటీలకు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version