షాకింగ్:లైగర్ ను చూసి కూడా రామ్ చరణ్ కు నత్తి పెట్టిన శంకర్..!!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ప్రస్తుతం  శంకర్  ఇండియన్ 2 కూడా తీస్తున్నాడు రెండూ ఒకే సారి కావటం తో శంకర్  అందుకు తగ్గట్టుగానే రెండు సినిమాల షూటింగ్స్ ప్లాన్ చేసాడట. రెండు సినిమాల కు  చెరి సగం రోజుల చొప్పున డేట్స్ ఇస్తూ నడపిస్తున్నాడు. ఈ సినిమా తో శంకర్ సమాజంలో జరిగే సీరియస్ పాయింట్ ను టచ్ చేస్తున్నాడట.

అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయాలపై లీకైన ఫోటోస్ నిరూపించాయి.ఇదిలా వుంటే ఈ మూవీ కోసం రామ్ చరణ్ తో శంకర్ రిస్క్ చేయబోతున్నాడనే ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తాజగా బయటికి వచ్చేసింది. అదే ఇప్పుడు సినిమాకు మైనస్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. బయటకి వచ్చిన వివరాల ప్రకారం తండ్రి పాత్రకు నత్తి ఉన్నట్లు గా ప్రచారం జరుగుతోంది.

అసలే లైగర్ లో పూరీ జగన్నాథ్ కూడా విజయ్ దేవరకొండ కు నత్తి ఉన్నట్లు చూపించి సినిమా మొత్తం చెడగొట్టాడు. దానితో ఎంతో హైప్ క్రియేట్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. మళ్లీ శంకర్ కూడా ఆ సినిమా రిజల్ట్ చూసి కూడా అలాంటి ప్రయత్నమే చేస్తుండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాని శంకర్ మాత్రం సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ మూవీలో రామ్ చరణ్ వినికిడి లోపం వున్న వ్యక్తిగా అద్భుతంగా నటించిన సంగతి ని గుర్తించి ఆ కారెక్టర్ ను డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news