తెలంగాణ రాజకీయాల్లో కొత్తపార్టీతో సంచలనం రేపిన వైయస్ షర్మిల, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కోడలిని అని చెప్పుకుంటున్న షర్మిల, తెలంగాణలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చేయడమే తన లక్ష్యం అని తెలిపారు. అందులో భాగంగానే నిరుద్యోగుల సమస్యను ఎత్తుకున్నారు. ఎన్నోరోజులుగా నోటిఫికేషన్లు లేక, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పడిగాపులు కాస్తున్న వారి తరపున ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం చేపట్టారు.
రాష్ట్రమంతా ఒక్కో జిల్లాల్లో నిరసన దీక్ష చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల నిరసన దీక్ష చేపడుతూ ఉన్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాల్లో నిరసన దీక్ష చేపట్టనున్నారు. నేడు ఉదయం పాలమూరు యూనివర్సిటీ వద్ద బైఠాయించి నిరసన తెలపనున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, నిరుద్యోగులు, ఇంకా అలాగే ఉండిపోతున్నారని వ్యాఖ్యానించారు.